మంచి ఉగ్రవాది..చెడ్డ ఉగ్రవాది ఉండరు!

మంచి ఉగ్రవాది..చెడ్డ ఉగ్రవాది ఉండరు!


బీజింగ్‌: ఉగ్రవాదంపై పోరాటానికి ఐక్య రాజ్యసమితిలో ఓ సమగ్ర విధానం అవసరమని బ్రిక్స్‌ దేశాలకు భారత్‌ స్పష్టం చేసింది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగి స్తున్న ఉగ్రవాదుల్లో మంచి ఉగ్రవాది... చెడ్డ ఉగ్రవాది అని ఉండరని... అందరూ నేరస్తులేనని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా అంతమొందించాలన్న విషయాన్ని సదస్సులో నొక్కి చెప్పామని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ మీడియా సమావేశంలో వెల్లడిం చారు. బ్రిక్స్‌లోని ఐదు దేశాల విదేశాంగ మంత్రులు సోమవారం ఇక్కడ సమావేశమయ్యారు.

Back to Top