ఆ పార్టీ ప్రచార బరిలో సినీ దిగ్గజాలు!

ఆ పార్టీ ప్రచార బరిలో సినీ దిగ్గజాలు!


రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సినీ గ్లామర్ తోడయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, పంజాబ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ సినీస్టార్లను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా మంగళవారం బాలీవుడ్ ప్రముఖులు అర్జున్ రాంపాల్, జాకీష్రఫ్ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద కనిపించారు. ఈ ఇద్దరు నటులు కూడా పార్టీ కార్యాలయం బీజేపీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు.అనంతరం బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయ నాయకుడిని కాదని, బీజేపీలో చేరే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశం కోసం మంచి పనులు చేస్తున్నదని, వాటికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రధాని మోదీ పథకాలైన స్వచ్ఛభారత్, పెద్దనోట్ల రద్దుకు తాను గట్టిగా మద్దతునిస్తున్నట్టు తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు తాను సిద్ధమేనంటూ సంకేతాలు ఇచ్చారు.

Back to Top