అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

అందుకే  రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు - Sakshi

అమరావతి: రాజధాని డిజైన్ల విషయంలో సినీ దర్శకుడు రాజమౌళిది ప్రత్యేక పాత్ర అంటూ ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. శుక్రవారం అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించిన సీఎం.. రాజమౌళి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి రాజీనామా తదితర అంశాలపై సమాధానాలిచ్చారు.

‘‘రాజధాని నిర్మాణంలో దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకుంటాం. ప్రత్యేక పాత్ర అంటూ లేదు. అయితే ఆయన గొప్ప దర్శకుడు కాబట్టి సాయం కోరాం. మా విజ్ఞప్తికి ఆయన కూడా పాజిటివ్ గా స్పందించారు’’ అని చంద్రబాబు అన్నారు.

జేసీ విషయం చాలా చిన్నది: నీటి సమస్యపై రాజీనామా చేస్తానంటూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చెప్పటం పెద్ద విషయం కాదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏదైనా ఉంటే తాము మాట్లాడతామన్నారు. రాజీనామా అంటూ హడావుడిగా నిర్ణయం తీసుకోవటం సరికాదని, ఇటీవల అనంతపురం పర్యటనలో కూడా ఈ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించానని తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top