హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ సంచలన వ్యాఖ్యలు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ సంచలన వ్యాఖ్యలు


ముంబై: మార్కెట్‌ క్యాపిటలైజేషన్ రీత్యా రెండో అత్యంత విలువైన కంపెనీగా  రికార్డ్‌ సృష్టించిన  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌  మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి సంచలన వ్యాఖ్యలు  చేశారు. డీమానిటైజేషన్‌ అనంతరం దేశం ఒకవైపు డిజిటల్‌ సేవల వైపు పరుగులు పెరుగుతోంటే   ఆదిత్య దీనికి భిన్నంగా స్పందించారు. ఇ-వాలెట్స్‌కు భవిష్యత్తు లేదని  అభిప్రాయపడ్డారు. డిజిటల్‌ వాలెట్‌ బిజినెస్‌ మోడల్ "లాభదాయకం"  కాదని  చెప్పారు.


నాస్కాం ఇండియా లీడర్‌షిప్‌ ఫోరంలోమాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు  చేశారు. ఈ సందర్భంగా  ప్రముఖ ఈ వాలెట్‌ కంపెనీపై పేటిఎం పై విమర్శలు గుప్పించారు.  వేలకోట్ల నష్టంలో వున్న పేటీఎం రూ. 500 బిల్లుపై  రూ. 250  క్యాష్‌ బ్యాక​ ఆఫర్‌ ను ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు.  చైనా లోవిజయం సాధించిన అలీబాబాలా కంపెనీని  భారతదేంలో కాపీ కొట్టడం సాధ్యంకాదన్నారు.  భారతీయ రెగ్యులేటరీ  అధికారుల కఠినమైన నిబంధనల నేపథ్యంలో   పేటీఎం లాంటి  సంస్థల విజయం సాధ్యం కాదని  ఆదిత్య  అభిప్రాయపడ్డారు.


బ్యాంకులవద్ద కూడా  డిజిటల్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేసిన ఆదిత్య, స్వతంత్ర వాలెట్ కంపెనీలు బ్యాంకులపై ఆధాపడాలన్నారు.   నిధులకోసం మధ్యవర్తిగా బ్యాంకులపై  ఆధారపడి ఉండాల్సిందేనని తేల్చి  చెప‍్పడం విశేషం.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకున్న పరిమితులను తొలగిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ పేర్కొనడంతో   శుక్రవారం ఈ కంపెనీ షేరు ధర రూ. 1450 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని నమోదుచేసింది.  రూ. 3.64 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్తో  ముకేష్‌ అంబానీ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విలువను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అధిగమించింది.   



కాగా మార్కెట్‌ క్యాప్‌ రీత్యా టాప్‌ లో టీసీఎస్‌ లో ఉండగా, రెండవ స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ, మూడవ స్థానంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిలిచిన సంగతి తెలిసిందే.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top