ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌పై యువనటి యాంటీ కామెంట్‌!

బిగ్‌బాస్‌పై యువనటి యాంటీ కామెంట్‌!


యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ షోపై వర్ధమాన నటి మానస హిమవర్ష ఫేస్‌బుక్‌లో ఒకింత వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్‌ షోలో తను భాగం కాకపోవడం ఆనందం కలిగిస్తున్నదని ఆమె పేర్కొన్నారు. 'సీరియస్ షిట్‌' అంటూ ఆమె బిగ్‌బాస్‌ షో తొలి ఎపిసోడ్‌ పూర్తయిన తర్వాత ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌ 'కాటమరాయుడు'లో శివబాలాజీ సరసన, దర్శకుడు వంశీ 'ఫ్యాషన్‌ డిజైనర్‌'లో నటించిన ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. ఎన్టీఆర్‌ అభిమానులు ఆమెను కించపరుస్తూ పోస్టులు పెట్టారు.అయితే, తన పోస్టును సమర్థించుకున్న ఆమె తాను ఎన్టీఆర్‌కు పెద్ద అభిమానినని తెలిపారు. 'ఆయన డ్యాన్స్‌ అద్భుతంగా ఉంటుంది. ఆయన పనిని పరిహసించడం ఇది కాదు' అని పేర్కొన్నారు. బిగ్‌బాస్‌ షోపై తన పోస్టును తొలగించే ప్రసక్తి లేదన్న ఆమె.. ఎన్టీఆర్‌ కించపరిచినట్టు తన పోస్టును వక్రీకరించొద్దంటూ సూచించారు.


Back to Top