భారీ ఎన్‌కౌంటర్‌.. టాప్‌ హిజ్బుల్‌ కమాండర్‌ హతం

భారీ ఎన్‌కౌంటర్‌.. టాప్‌ హిజ్బుల్‌ కమాండర్‌ హతం


శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా షోపియన్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాల చేతుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన ఉగ్రవాదుల్లో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ టాప్‌ కమాండర్‌ యాసిన్‌ యాతూ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.ఉగ్రవాదులు-ఆర్మీ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భారత సైనికులు కూడా అమరులు అయ్యారు. షోషియన్‌ జిల్లాలోని అన్వీరా గ్రామంలో శనివారం సాయంత్రం ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాదుల ఏరివేతతో ఆదివారం ఉదయం తెల్లవారుజామున ముగిసింది.

Back to Top