ఘోర ప్రమాదం.. 20మంది చిన్నారులు ఆహుతి
జోహన్నెస్‌ బర్గ్‌:  దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులతో వెళుతున్న  బస్సు శుక్రవారం ప్రమాదానికి గురైంది.  దేశ రాజధాని  ప్రిటోరియాకు 70 కిలోమీటర్ల (45 మైళ్ళు) దూరంలో ఉన్న బ్రోంకోర్సట్స్‌ రూట్‌  వెరేనా పట్టణాల మధ్య రహదారిపై మినీబస్ -ట్రక్కు గుద్దుకోవడంతో 20మంది చిన్నారులు మృతి చెందారు.  ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగడంతో  చిన్నారులు  అగ్నికి ఆహుతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనలో మరికొంత మంది విద్యార్థులు గాయపడ్డట్టు తెలుస్తోంది. పారామెడికల్ సిబ్బంది, అగ్రిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.  సహాయక చర్యలు   కొనసాతున్నాయని స్తానిక అధికారులు ఒక ప్రకటనలోతెలిపారు. 

Back to Top