పరకాల ఎమ్మెల్యే కుటుంబానికి కోయదొరల టోకరా

పరకాల ఎమ్మెల్యే కుటుంబానికి కోయదొరల టోకరా


వరంగల్‌ : వరంగల్‌ జిల్లా పరకాల ఎమ్మెల్యే  చల్లా ధర్మారెడ్డి కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. పూజలు చేస్తే పదవి వస్తుందంటూ ఎమ్మెల్యే కుటుంబానికి కోయదొరలు టోకరా వేశారు. పూజలు చేస్తే తన తండ్రికి మంత్రి పదవి వస్తుందని... ఎమ్మెల్యే కుమార్తె శ్యాంరెడ్డి మానస రెడ్డి... కరీమాబాద్‌కు చెందిన ఇద్దరు కోయదొరలను సంప్రదించారు. కాశీలో పూజలు చేస్తే మంత్రి పదవి వస్తుందని,  అక్కడకు వెళ్ళి పూజలు చేస్తామని అందుకోసం కోసం  ఖర్చు అవుతుందని కోయదొరలు నమ్మించారు.


ఈ క్రమంలో మానస నుంచి సుమారు రూ.57 లక్షలు వసూలు చేసి, ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయారు. చివరికి మోసపోయామని గుర్తించిన ఆమె ఈ విషయాన్ని ఇంట్లోవారికి తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసిన కోయదొరలు లక్ష్మణరాజు, వంశీరాజులపై  420, 406 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Back to Top