15 ఏళ్ల అమ్మాయిని మోసం చేసిన 13 ఏళ్ల కుర్రాడు!

15 ఏళ్ల అమ్మాయిని మోసం చేసిన 13 ఏళ్ల కుర్రాడు!


కేరళ పోలీసుల వద్దకు ఓ విచిత్రమైన కేసు వచ్చింది. ఇంటి పక్కనే ఉండే 15 ఏళ్ల అమ్మాయిని తల్లిని చేసిన నేరంలో 13 ఏళ్ల కుర్రాడిని కొల్లాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా బాలనేరస్తుల న్యాయబోర్డు అయిన కొల్లాం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వద్ద అతడిని హాజరు పరిచారు. బాలుడికి మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసి తల్లిదండ్రులతో ఇంటికి పంపేశారు. ఇలాంటిదే మరోకేసు ఇటీవల ఎర్నాకులంలో బయటపడింది. 16 ఏళ్ల అమ్మాయి 12 ఏళ్ల అబ్బాయితో కలిసి ఓ బిడ్డను కంది.తాజా కేసు నాలుగు రోజుల క్రితం స్టేషన్‌కు వచ్చింది. తొమ్మిదో తరగతి చదివిన బాలిక ఓ బిడ్డను కంది. తనకు కడుపునొప్పిగా ఉందని ఆమె చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమెకు తొమ్మిది నెలలు నిండాయని వైద్యురాలు చెప్పారు. అమ్మాయికి ఎక్కువ వయసు లేదు కాబట్టి పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్ సూచించినా, ఇంటికి తిరిగొచ్చిన తర్వాత అమ్మాయి బిడ్డను కంది. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయించారు. పక్కింటి కుర్రాడే తన గర్భానికి కారణమని బాలిక తెలిపింది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ కుర్రాడు మంగళూరులో బంధువుల ఇంటికి వెళ్లగా అక్కడినుంచి పోలీసులు పిలిపించి తీసుకొచ్చారు.తాను ఆ అమ్మాయిని కొన్నిసార్లు కలిసిన మాట వాస్తవమేనని, తమ మధ్య లైంగిక సంబంధం ఉందని బాలుడు అంగీకరించాడు. దాంతో పోలీసులు అతడిని బాల నేరస్తుల న్యాయబోర్డు వద్దకు తీసుకెళ్లారు. బాలుడి రక్త నమూనాలను సేకరించిన పోలీసులు వాటిని డీఎన్‌ఏ పరీక్షల కోసం పంపారు. నిజంగా ఆ బిడ్డకు ఈ బాలుడే తండ్రా కాదా అన్నది నిర్ధారించనున్నారు. ఇద్దరూ మైనర్లే కాబట్టి ఈ కేసులో ఏం చేయాలో న్యాయ నిపుణులను అడిగి తెలుసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Back to Top