మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..

బీరుసీసాతో గొంతులో పొడుచుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం
పరిస్థితి విషమం.. హైదరాబాద్కు తరలింపు
హాలియా పట్టణంలో ఘటన
హాలియా (నాగార్జునసాగర్) : మద్యం మత్తులో ఓ యువకుడు విచక్షణ కోల్పోయాడు. తన తల్లి మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో మనస్తాపానికి గురై బీరుసీసాను పగులగొట్టి గొంతులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హాలియా పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. హాలియా పట్టణానికి చెందిన లింగాల లక్ష్మమ్మకు భర్త లేకపోవడంతో కుమారుడు లింగాల శ్రీను(30)తో కలిసి ఓ హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తోంది. శ్రీను ఏ పని చేయకుండా జూలాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగి వస్తూ తల్లితో ఘర్షణ పడుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తన తల్లిని డబ్బులు అడుగగా ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఇంటి నుంచి రోడ్డు వద్దకు వెళ్లి బీరుసీసాను పగలగొట్టి తన గొంతులో పొడుచుకున్నాడు. గమనించిన స్థానికులు అడ్డుకోబోగా వారిని బీరుసీసాతో భయబ్రాంతులకు గురిచేశాడు. మరి కొంత మంది యువకులు ధైర్యంతో ముందుకు వెళ్లి అతని చేతిలో ఉన్న బీరుసీసాను తీసివేశారు. అప్పటికే తన గొంతులో బీరుసీసాతో పొడుచుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగిం ది. విషయం తెలుసుకున్న హాలియా ఎస్ఐ వీర రాఘవులు సిబ్బందితో ఘటన స్థలం వద్దకు వచ్చి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం నల్లగొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడినుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి