ఆత్మహత్య చేసుకుంటున్నా..!

Woman Phoned Dial 100 To Say Committing Suicide - Sakshi

100కు ఫోన్‌ చేసిన మహిళ

స్పందించిన పోలీసులు.. ఆస్పత్రికి తరలింపు

గణపురం: ‘భర్తతో గొడవైంది.. జీవితం మీద విరక్తి చెందా.. నా రెండేళ్ల కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నా’అని ఓ మహిళ 100 నంబరుకు ఫోన్‌ చేసింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆమెను రక్షించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామానికి చెందిన కొడగాని మౌనిక.. బుధవారం 100 నంబర్‌కు డయల్‌ చేసింది. దీంతో కంట్రోల్‌ రూం నుంచి గణపురం పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా.. ఎస్సై రాజన్‌బాబు సిబ్బందితో హుటాహుటిన వారి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో ఉన్న తల్లీ కొడుకులను స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. మౌనిక ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని హైదరాబాద్‌లోని ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచి్చనట్లు ఎస్సై చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top