సాగర్‌ చివరి ఆయకట్టుకు నీరు: హరీశ్‌రావు

Water to the end of Sagar - Sakshi

ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టిన నాగార్జునసాగర్‌ ఆధునీకరణతో పాలేరులోని చివరి ఆయకట్టుకు నీరందించే వెçసులుబాటుకలిగిందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఈ పనులు కేవలం 33శాతమే జరగ్గా...ప్రస్తుతం 95శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.

గతంలో 1.64లక్షల ఎకరాల గ్యాప్‌ ఆయకట్టు ఉండగా తమ ప్రభుత్వం చేపట్టిన పనుల వల్ల అది 33వేల ఎకరాలకు తగ్గిందన్నారు. సాగర్‌నుంచి పాలేరుకు నీరు చేరేందుకు గతంలో 3 రోజులు పట్టేదని, కానీప్రస్తుతం రెండురోజుల్లోనే నీరొచ్చే అవకాశంఉందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top