BREAKING NEWS
  • హైదరాబాద్‌: మిషన్‌ భగీరథపై సీఎం కేసీఆర్‌ సమీక్ష, త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశం
  • పీఎంఎల్‌ఏ కేసు: వేర్పాటువాద నేత షబీర్‌ షాపై చార్జిషీటును ఢిల్లీ కోర్టుకు సమర్పించిన ఈడీ

కేటీఆర్‌.. నోరు అదుపులో ఉంచుకో

కేటీఆర్‌.. నోరు అదుపులో ఉంచుకో


టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫైర్‌

వీణవంక(హుజూరాబాద్‌): ‘కేటీఆర్‌ నువ్వో బచ్చా... కాంగ్రెస్‌ను విమర్శించే స్థాయి నీకు లేదు. నోరు అదుపులో పెట్టుకో..’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పోలీసులు గులాబీ చొక్కాలు వేసుకున్న విధంగానే.. కాంగ్రెస్‌ నాయకు లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు.


ఇటీవల వరంగల్‌లో కార్పొరేటర్‌ హత్య జరిగితే పాతకక్షలు కారణమంటూ నిందితులు పోలీసుల ముందు లొంగిపోయినా... కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఆ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై అక్రమ కేసు బనా యించడం తగదని అన్నారు. కేసు ఉపసంహరించుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్‌ త్యాగాలతో కూడిన పార్టీ అని, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. నకిలీ విత్తనాలు అరికడుతున్నామని చెబుతున్న ప్రభుత్వమే రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతోందని దుయ్యబ ట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచినా, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. 

Back to Top