కేటీఆర్‌కు యూఏఈ ఆహ్వానం

UAE Government's Invites KTR To Visit Their Country - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కె.తారకరామారావును తమ దేశంలో పర్యటించాలని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఆహ్వానించింది. విద్య, వ్యాపార, వాణిజ్య రంగాల్లో బలమైన సంబంధాల దిశగా చర్చించేందుకు తమ దేశంలో పర్యటించాలని కోరింది. ఈమేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి అబ్దుల్లా బిన్‌ జాహెద్‌ అల్‌ నహ్యన్‌ కేటీఆర్‌కు ఆహ్వాన లేఖ పంపారు. తెలంగాణలో తన పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యాన్ని ఆయన ప్రస్తావించి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తన దృష్టికి తీసుకొచ్చిన పలు కీలకమైన అంశాల్లో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వ్యాపార, వాణిజ్యాలతో పాటు గల్ఫ్‌ కార్మికుల అంశాలను కూడా యూఏఈ మంత్రి దృష్టికి తీసుకెళ్లిందని కేటీఆర్‌ తెలిపారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top