అప్పుల బాధతో ఇద్దరి రైతుల ఆత్మహత్య


అప్పులు.. రైతుల పాలిట మృత్యుపాశాలయ్యాయి. జిల్లాలో మంగళవారం ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.  గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన ఫిరంగి ఎల్లయ్య (50), నంగునూరు మండలం మగ్దుంపూర్ కు చెందిన రైతు నరిగే పరశురాములు (42) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 

 గజ్వేల్/నంగునూరు : అప్పులబాధలు తాళలేక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన  గజ్వేల్, నంగునూరు మండలాల్లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన ఫిరంగి ఎల్లయ్య (50)కు రెండెకరాల సొంత భూమి ఉంది. గతేడాది మరో పదెకరాల భూమి కౌలుకు తీసుకుని మొత్తం 12ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. కాలం కలిసిరాక పత్తి పంట దెబ్బతినడంతో పాటు చేతికందిన దిగుబడులకు గిట్టుబాటు ధర రాలేదు. సాగునీటి కోసం వేసిన రెండు బోరుబావుల్లో నీళ్లు రాక అప్పులపాలయ్యాడు. అంతకు ముందు ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేసేందుకు, పంట పెట్టుబడులు, కుటుంబ పోషణకు మొత్తం కలిసి సుమారు రూ. 5 లక్షల వరకు అప్పులయ్యాయి. అయితే రుణదాతల నుంచి అప్పులు తీర్చాలని ఒత్తి ళ్లు రావడంతో మనస్తాపం చెందాడు. దీంతో ఆత్మహత్యకు పాల్పడటమే శరణ్యంగా భావించాడు.

 

 ఈ క్రమంలోనే మంగళవారం తన చేను వద్ద ఉన్న ఓ వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించి న కుటుంబీకులు దుఃఖసాగరంలో ము నిగిపోయారు. మృతుడికి భార్య మల్లవ్వతో పాటు ఇద్దరు పెళ్లిళ్లు అయిన కు మార్తెలు, మరో కుమారుడు ఆంజనేయు లు ఉన్నారు. కుకునూర్‌పల్లి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

 

 మరో రైతు...

 పంటల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ ఆవేదనకు గురైన ఓ రైతు మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘట న నంగునూరు మండలం మగ్దుంపూర్ లో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నరిగె పరశురాములు (42) తనకున్న నాలుగున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పంటలు పండించేందు కు సుమారు రూ. 3 లక్షల వరకు అప్పు లు చేసి ఆరు బోర్లు వేయించాడు. రెండు బోర్లలో నీరు పడడంతో వరి, పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేశాడు.

 

 ఏడాది కిందట భార్య భూదవ్వ, కుమారులు రవి, తిరుపతితో పాటు తన పేరున ఉన్న పాసుబుక్కులను నంగునూరు ఆంధ్రాబ్యాంక్, పాలమాకుల పీఏసీఎస్‌లో తనఖాపెట్టి రూ 1.20 లక్ష లు అప్పులు తీసుకున్నాడు. ఇటీవలే పొ లాన్ని దుక్కిదున్ని నారు వేశారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా వర్షాలు పడకపోవడంతో ఒక బోరు నీరులేక ఎండిపోయింది. మరో బోరులో ఆశించిన మేర నీరు రాకపోవడంతో తరచూ కుటుంబ సభ్యుల వద్ద మదనపడుతుండేవాడు.

 

 ఈ క్రమంలో మంగళవారం పొలం వద్దకు వెళ్లిన పరశురాములు పురుగుల మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అ యితే రైతు పరశురాములు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆర్‌ఐ సందీప్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు.

 

 రాజగోపాల్‌పేట పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ కడారి ప్రభాకర్‌రెడ్డి, రైతు సంఘాల సమాఖ్య మండల కన్వీనర్ వాసర యాదమల్లు, నాయకులు అచ్చిన మల్లయ్య, అచ్చిన సత్తయ్యలు ప్రభుత్వాన్ని కోరారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top