కొత్త వారికి చాన్స్‌!

The TRS is preparing all the way before the Lok Sabha elections - Sakshi

పార్లమెంటు బరిలోకి పకడ్బందీగా టీఆర్‌ఎస్‌

లోక్‌సభ అభ్యర్థులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని 17 ఎంపీ స్థానా ల్లో ఒక్క హైదరాబాద్‌ ఎంపీ స్థానం మినహా.. మిగి లిన 16 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. సీఎం కేసీఆర్‌ వ్యక్తిగతంగా ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఎన్నికల పర్యవేక్షణకు వ్యూహం రచిస్తున్నారు. ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌కు ఒక ప్రధాన కార్యదర్శిని, ముగ్గురు కార్యదర్శులను ఇన్‌చార్జీలుగా నియమించారు. లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని సెగ్మెం ట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వారికి బాధ్యతలు అప్పగించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే.. లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి లోక్‌సభ ఎన్నికల ఫలి తాలను అంచనా వేస్తూ వచ్చే ఎన్నికలకు వ్యూహం సిద్ధం చేస్తున్నారు.

గతంలో పోటీ చేసి గెలవని స్థానా ల్లో ఈసారి కచ్చితంగా దక్కించుకునేలా పావులు కదుపుతున్నారు. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుతో బరిలోకి దిగిన టీఆర్‌ఎస్‌.. కరీంనగర్, మెదక్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. సాంకేతిక కారణాలతో నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి కారు గుర్తు దక్కలేదు. మిగిలిన ఐదు లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. 2009 ఎన్నికలలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మెదక్, జహీరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి మహబూబ్‌నగర్, మెదక్‌ సీట్లను గెలుచుకుంది. 2014 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది.

నాగర్‌కర్నూల్, నల్లగొండ, మల్కాజ్‌గిరి, ఖమ్మం, హైదరాబాద్, సికింద్రాబాద్‌ మినహా అన్ని స్థానాలను గెలుచుకుంది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో పోటీ చేసిన నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానాన్ని ఆ పార్టీ ఇప్పటికీ గెలుచుకోలేకపోయింది. 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసినా సికిం ద్రాబాద్‌ సెగ్మెంట్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో సికింద్రాబాద్, నాగర్‌కర్నూల్‌ స్థానాలను కచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో కేసీఆర్‌ వ్యూహం రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కలను పరిశీలిస్తే ఈ రెండు సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌కు పూర్తి ఆధిక్యత కనిపిస్తోంది. ఈ రెండు లోక్‌సభ స్థానాల పరిధుల్లో ఏడు చొప్పున ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కటి మినహా అన్ని టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ 2 లోక్‌సభ సీట్లను గెలుచుకునే ధీమాతో టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఉంది.

కొన్ని చోట్ల కొత్త రక్తం..
2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 11, కాంగ్రెస్‌ 2 స్థానాలను, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, ఎంఐఎం ఒక్కో సీటును గెలుచుకున్నాయి. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి (కాంగ్రెస్‌), మల్కాజిగిరి ఎంపీ సీహెచ్‌ మల్లారెడ్డి (టీడీపీ), ఖమ్మం ఎంపీ పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. చేవేళ్ల లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రస్తుత లెక్కల ప్రకారం టీఆర్‌ఎస్‌కు 2014 ఎన్నికల సమయంలో గెలిచిన సీట్లకు సమానంగా 11 మంది సిట్టింగ్‌ ఎంపీలు ఉన్నారు. పెద్దపల్లి, మల్కాజ్‌గిరి, చేవేళ్ల నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థుల ఎంపిక అనివార్యమైంది. సిట్టింగ్‌ స్థానాల్లోనూ 2,3 చోట్ల కొత్త వారికి అవకాశం ఇస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఖమ్మం స్థానంలో సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేరును టీఆర్‌ఎస్‌ అధిష్టానం పరి శీలిస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కు ఈ లోక్‌సభ సెగ్మెంట్‌లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్‌లో గెలుపు ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అధిష్టానం ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది.అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పరంగా మహబూ బాబాద్‌ లోక్‌సభ పరిధిలోనూ టీఆర్‌ఎస్‌కు ప్రతి కూల ఫలితాలే వచ్చాయి. ఈ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 సీట్లే గెలుచుకుంది. ఇక్కడి సిట్టింగ్‌ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‌.

మాజీ మంత్రి చందులాల్‌ లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు నాయక్‌ పేరును కూడా టీఆర్‌ఎస్‌ పరిశీలిస్తోంది. కేసీఆర్‌ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీతారాంను భారీ మెజారిటీతో ఎంపీగా గెలిపించాలని అన్నారు. చివరికి ఎవరి పేరును ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని ఈసారి కచ్చి తంగా గెలవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ 6 చోట్ల, ఎంఐఎం ఒకచోట గెలిచాయి. దీంతో ఈ సెగ్మెంట్‌లో గెలుపు ఖాయమని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. తలసాని సాయికిరణ్‌ యాదవ్, బి.శ్రీదేవి యాదవ్, దండె విఠల్‌ పేర్లను టీఆర్‌ఎస్‌ అధిష్టానం పరిశీలిస్తోంది.

నాగర్‌కర్నూల్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌కు గెలుపు దక్కట్లేదు. ఇక్కడ ఈసారి కచ్చితంగా గెలవాల ని భావిస్తోంది. మాజీ మంత్రి రాములు, మాజీ ఎంపీ మందా జగన్నాథం టికెట్‌ ఆశిస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి, మల్కాజిగిరి ఎంపీ లు పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ కొత్త వారిని అభ్యర్థులు గా నిలపనుంది. పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్‌లో మాజీ ఎంపీ జి.వివేకానందను బరిలో దింపాలని భావిస్తోంది. మల్కాజ్‌గిరిలో అభ్యర్థి కోసం బండారి లక్ష్మారెడ్డి, నవీన్‌రావు పేర్లను పరిశీలి స్తోంది. చేవేళ్ల లోక్‌సభ స్థానానికి శాసనమండలి చైర్మన్‌ వి.స్వామిగౌడ్, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిలలో ఒకరికి అవకాశం ఇవ్వనుం దని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top