అయ్యో! దొంగ ఎంత పనిచేశాడు..

అయ్యో!  దొంగ ఎంత పనిచేశాడు..

సికింద్రాబాద్‌: నగరంలోని మారేడ్‌పల్లిలో మంగళవారం తెల్లవారుజామున దారుణం వెలుగుచూసింది. ఓ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగ అక్కడ ఏమి దొరకకపోవడంతో.. ఆగ్రహానికి గురై ఆ ఇంటికే నిప్పు పెట్టాడు. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
Back to Top