ఖైదీల ఆత్మహత్యల నివారణకే వంద ప్రశ్నలు

There Are A Hundred Questions To Prevent The Suicide Of Prisoners - Sakshi

సంగారెడ్డి క్రైం: రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో శిక్షణ అనుభవిస్తున్న ఖైదీల ఆత్మహత్యలను నిరోధించడానికి వంద ప్రశ్నల కార్యక్రమం రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా జైలు నుంచి శ్రీకారం చుట్టారు. మంగళవారం నాటికి ఈ కార్యక్రమం మూడో రోజుకు చేరుకుంది.

జైళ్లశాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీ రిటైర్డ్‌ సైకాలజిస్టు, తెలంగాణ జైళ్లశాఖ, ఉన్నతి ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ మీనా నేతృత్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లలో శిక్షణ అనుభవిస్తున్న ఖైదీలపై వంద ప్రశ్నల కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉద్ధ్యేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఎలాంటి తప్పులు చేయకుండా శిక్షణ అనుభవించే ఖైదీలు, జీవితకాలం శిక్ష పడ్డా ఖైదీలు మెంటల్‌ హెల్త్‌ సంబంధిత విషయాలపై వారి సత్ప్రప్రవర్తనను గుర్తించడానికి వంద ప్రశ్నల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఖైదీలు ఏ వయస్సులో ఉన్నారు వారు ఏ విధమైన నేరాలు చేశారనే విషయాన్ని ఈ విధానం ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

వారికి సంబంధిత విషయాలపైనే వందప్రశ్నలు తయారు చేస్తామన్నారు. చాలా మంది శిక్షను అనుభవించే వారిలో డిప్రెషన్‌కు గురై అఘాయ్యితాలకు చేసుకుంటున్నారన్నారు. వీటి నివారణకే ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలోనే పైలెట్‌ ప్రాజెక్టు కింద సంగారెడ్డి జిల్లా జైలును ఎంపిక చేయడం జరిగిందన్నారు.

చాలా చోట్ల ఎలాంటి నేరం చేయకుండా జైళ్లకు వచ్చి శిక్షను అనుభవించే ఖైదీలు మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అలాంటి ఆత్మహత్యలను నివారించడానికే ఈ వంద ప్రశ్నల కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 

ఇందులో మూడు విభాగాలుగా విభజిస్తామని తెలిపారు. జైలులో ఉన్న ఖైదీలపై వంద ప్రశ్నలు ప్రయోగించి అందులో మూడు విభాగాలు విభజిస్తామన్నారు. ఖైదీలు ఎక్కువగా డిప్రెషన్‌లో ఉన్న వారికి ఒక విభాగం, సాధారణంగా ఉన్న వారిని మరో విభాగం, తక్కువగా ఉన్న వారిని మరో విభాగంగా విభజించి వారికిచ్చే కౌన్సెలింగ్‌ విధానాన్ని ఖరారు చేస్తామన్నారు.

ఈ విషయాన్ని కంప్యూటర్‌లో ఎప్పుటికప్పుడు పొందుపరుస్తామని తెలిపారు. కంది జిల్లా జైలులో 180 మంది ఖైదీలు ఉండగా వారికి మూడు రోజుల్లో వంద ప్రశ్నల కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. అదే విధంగా పాకిస్తాన్‌లోని లాతూర్‌ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్, రచయిత డాక్టర్‌ కంచెన్‌సెతు, ప్రస్తుత హైదరాబాద్‌ నివాసి అయిన జైళ్లలో ఉన్న ఖైదీల వ్యక్తిగతాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేక దృష్టి సారించి జిల్లా జైలుకు తగిన సూచనలు అందించారు.

అదే విధంగా ఉన్నతి ప్రోగ్రాం ద్వారా ఎందరో ఖైదీలు మానసిక ప్రవర్తన పొంది ఇతరులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ఉన్నతి ద్వారా అనేక మంది ఖైదీలు నేరాలకు పాల్పడి జైళ్లకు వచ్చే సంఖ్య తగ్గిందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ సరోజా ఆర్య, డాక్టర్‌ వెంకటేశ్, డాక్టర్‌ నిరంజన్‌రెడ్డి, స్రవంతి, రజిత, జైలు కౌన్సిలర్‌ హరిశంకర్‌తో పాటు జైలు సూపరింటెండెంట్‌ సంతోష్‌రాయ్, జైలర్‌ కాళిదాసు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top