కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం - Sakshi


జ్యోతినగర్ :  కేంద్రప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఐఎఫ్‌టీయూ నాయకులు ఎన్టీపీసీ రామగుండం మేడిపల్లి సెంటర్‌లో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బుధవారం జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం ఐఎఫ్‌టీయూ అనుబంధ జిల్లా కమిటీ పిలుపుమేరకు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్ మాట్లాడుతూ ఎన్‌డీఏ అధికారంలోకి వస్తే కార్మికులు, రైతులు, పేదల జీవితాలు బాగుపడతాయని చెప్పిన నాయకులు ఇప్పుడు అందుకు వ్యతిరేకంగా నిర్ణయూలు తీసుకుంటున్నారని ఆరోపించారు.కార్మికుని జీతం నుంచి పీఎఫ్‌కు జమ చేసుకుంటే పన్ను రూపేణా కోత విధించాలని ప్రయత్నిచడం సిగ్గుచేటన్నారు. ఈనెల 29న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టు కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, బ్రాంచి కార్యదర్శి బుచ్చన్న, రాయమల్లు, అహ్మద్, కొంరయ్య, శంకర్, సత్యం, యాదగిరి, అజయ్, వెంకటస్వామి, పర్వతాలు, మల్లేష్, శంకరన్న, రవితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరిఖనిలో..

 గోదావరిఖని : మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జీఎల్‌బీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సంపత్‌కుమార్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మేక్ ఇన్‌ఇండియా పేరుతో బహుళజాతి సంస్థలు, సామ్రాజ్యవాదులకు దేశాన్ని తాకట్టుపెట్టేందుకు యత్నిస్తోందనిఆరోపించారు. ఈనెల 10వరకు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపించాలని కోరారు. నాయకులు ఇ.నరేశ్, తోకల రమేశ్, కనుకుంట్ల మోజేస్, ఎస్.కనుకయ్య, ఎండీ వలీఅహ్మద్, బి.కృష్ణ, కొయ్యడ శంకర్, యాట్ల సమ్మయ్య, ఇ.చంద్రయ్య, ఎం.మొండయ్య, శ్రీనివాస్, రవి, భానయ్య తదితరులు పాల్గొన్నారు. యైటింక్లయిన్‌కాలనీలో..

 యైటింక్లయిన్‌కాలనీ : కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యాలయం నుంచి చౌరస్తావరకు ర్యాలీ నిర్వహించారు. నాయకులు అశోక్, సురేష్, దుర్గయ్య, నిర్మల, రాజనర్సు, దుర్గం శంకర్, పవన్, మల్లికార్జున్, కొమురమ్మ, కవిత బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top