సామాజిక ఎజెండానే బాహుబలి: తమ్మినేని

సామాజిక ఎజెండానే బాహుబలి: తమ్మినేని


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సామాజిక ఎజెండా మాత్రమే బాహుబలి అని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. బాహుబలి వస్తాండంటూ చర్చ జరుగుతోందని.. అయితే ఇది ఎవరో ఒకరి వల్ల అయ్యేది కాదన్నారు. ప్రత్యామ్నాయ ఎజెండాగా వస్తే దానిని ఆమోదించే వారు బాహుబలి చుట్టూ చేరతారన్నారు.


సుదీర్ఘ పాదయాత్ర ముగించుకుని వచ్చిన తమ్మినేని వీరభద్రం, బృంద సభ్యులు ఎస్‌.రమ, శోభన్‌కుమార్, నగేష్‌ తదితరులకు సోమవారం ఎబీ భవన్‌లో పార్టీ నాయకులు సాదర స్వాగతం పలికారు. తమ్మినేనికి ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అభినందనలు తెలియజేశారు.

Back to Top