ఆదిలాబాద్‌ @ 7 డిగ్రీలు

Temperature in adilabad Fall Down to 7 Degres - Sakshi

రాష్ట్రంలో పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత 7 డిగ్రీలుగా నమోదైంది. మెదక్‌లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా 11 డిగ్రీలు, ఖమ్మంలో 4 డిగ్రీలు తక్కువగా 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. అలాగే భద్రాచలంలో 3 డిగ్రీలు తక్కువగా 14 డిగ్రీలు.. హైదరాబాద్‌లో ఒక డిగ్రీ తక్కువగా 15 డిగ్రీలు, హన్మకొండ, హకీంపేట, నిజామాబాద్, రామగుండంలలో 15 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలూ సాధారణం కంటే ఎక్కువగా రికార్డవుతున్నాయి. హైదరాబాద్‌లో సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా 32 డిగ్రీలు.. హకీంపేట, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్‌లలో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top