తెలంగాణ వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షం భేటీ


హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ వైఎస్ఆర్ సీపీ శాసనసభా పక్ష సమావేశం శనివారం ప్రారంభమైంది. లోటస్ పాండ్లో ఈ సమావేశం జరుగుతోంది. ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. కాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లాల వారీగా సమీక్షలకు సిద్దమైంది. వచ్చే నెల మొదటివారం నుంచి  వైఎస్‌ జగన్‌ వారం రోజుల పాటు ఈ సమీక్షలు చేయనున్నారు. ఇప్పటికే సీమాంధ్రలోని 13 జిల్లా కేంద్రాల్లో పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీలు రివ్యూ చేస్తున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top