బీఎస్పీ నుంచి సయ్యద్‌ ఇబ్రహీం 

 Syed Ibrahim BSP Contest In Election - Sakshi

అనుచరులతో కలిసి ర్యాలీ..  నామినేషన్‌ దాఖలు 

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌)/స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున టికెట్‌ ఆశించిన సయ్యద్‌ ఇబ్రహీంకు స్థానం దక్కకపోవడంతో రెబల్‌గా బరిలోకి దిగారు. ఈ స్థానాన్ని మహాకూటమి తరఫున టీడీపీకి కేటాయించడంతో ఆయనకు నిరాశ ఎదురైంది. ఈ మేరకు పట్టణంలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన ఉదయం 11 గంటలకు విలేకరులతో మాట్లాడిన ఆయన మరో రెండు గంటల్లో కాంగ్రెస్‌ అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుని టికెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అయితే, స్పందన రాకపోవడంతో మధ్యాహ్నం 1:30 గంటలకు కార్యాలయం నుంచి ర్యాలీగా వెల్లి బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ) అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల రాజ్యాధికారమే బీఎస్‌పీ లక్ష్యమని అన్నారు. బహుజనుల ఓట్లు వేసుకుని ప్రధాన పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ తనకు టికెట్‌ ఇస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్త వెంకటేశ్‌.. ఇబ్రహీం నామినేషన్‌ కోసం రూ.10వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మిట్టె నర్సింహ, నాగరాజు, శంకర్‌నాయక్, సజ్జద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top