ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు

suspension of the teacher in nalgonda - Sakshi

 హెచ్‌ఎం, ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎంకు మెమోలు జారీ

విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కారణం

చిట్యాల (నకిరేకల్‌) : విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడికి మెమోలు జారీ అయ్యాయని బుధవారం ఎంఈఓ వీరమళ్ల రవీందర్‌ తెలిపారు. వివరాలు.. మండలంలోని ఏపూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జి.అంజయ్య పదో తరగతి విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించి, వేధించినట్లు ఇటీవల పై అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పాఠశాలలో సోమవారం ప్రత్యేక కమిటీతో విద్యార్థులను విచారించి నివేదిక అందజేశారు. అభియోగాలు వాస్తవమని తేలడంతో డీఈఓ చైతన్యజైని ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడు అంజయ్యను సస్పెండ్‌ చేసి ఆ పాఠశాల హెచ్‌ఎం నర్సిరెడ్డి, ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం రమేష్‌లకు మె మోలను అందజేసినట్లు ఎంఈఓ  తెలిపారు. ఉపాధ్యాయు డు అంజయ్య విద్యార్థినుల పట్ల లైంగికంగా వేధించినట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం నర్సిరెడ్డి డీఈఓ ఆదేశాల మేరకు పోలీసుస్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సైదాబాబ తెలిపారు. 

మా పిల్లలను వేధించలేదు..
ఏపూరు పాఠశాలలో లైంగిక వేధింపుల నేపథ్యంలో ఆ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు బుధవారం కలెక్టర్‌ను కలిశారు. తమ పిల్లలపై ఉపాధ్యాయులు ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని వారు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల మధ్య వచ్చిన పొరపొచ్చాలతో అంజయ్య అనే ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయిం చారని విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top