వైరల్‌.. గాంధీలో వైద్య విద్యార్థుల టిక్‌టాక్‌

Students TikTok At Gandhi Hospital Goes Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ ఉన్న యాప్‌లలో టిక్‌టాక్‌ ఒకటి. అయితే ఈ యాప్‌తో కొందరు సెలబ్రిటీలుగా మారుతుంటే.. చాలా మంది తమ పనులు మరిచి టిక్‌టాక్‌కు బానిసలుగా మారుతున్నారు. తాజాగా గాంధీ ఆస్పత్రిలో వైద్య విద్యార్థులు టిక్‌టాక్‌ బాట పట్టారు. తమ విధులను మరిచి ఆస్పత్రిలో టిక్‌టాక్‌ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ వీడియోలు కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై వేగంగా స్పందించిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చర్యలు ప్రారంభించారు.

ఈ వీడియోల్లో ఉన్నవారిని సాధన మెడికల్‌ కాలేజ్‌లో ఫిజియోథెరపీ విద్యార్థులు సామ్యూల్‌, వీణలుగా గుర్తించారు. వారు కేవలం ఇంటర్న్‌షిప్‌ కోసం మాత్రమే గాంధీకి వచ్చారని.. టిక్‌టాక్‌ వీడియోలతో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై డిపార్ట్‌మెంటల్‌ విచారణకు ఆదేశించిడంతోపాటు.. ఫిజియోథెరపీ ఇంచార్జ్‌కు నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే ఆస్పత్రిలో ఇంకా ఎవరైనా విద్యార్థులు టిక్‌టాక్‌ వీడియోలు చిత్రీకరించారనే దానిపై కూడా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఆ ఇద్దరు విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌ నుంచి తొలగించారు.

ఇటీవల ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు కూడా టిక్‌టాక్‌ యాప్‌లో సరదా వీడియోలు అప్‌లోడ్‌ చేసి.. హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ టిక్‌టాక్‌ వీడియోలు వైరల్‌ కావడంతో కార్పొరేషన్‌ సిబ్బంది తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top