‘అర్హత సాధించినా మా పేర్లు లేవు’

Students Protest Against Police Recruitment Board - Sakshi

హైదరాబాద్‌: ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్‌ అర్హత పరీక్షల్లో తాము అన్ని విధాలా అర్హులమైనప్పటికీ, అర్హుల జాబితాలో తమ పేర్తు లేవని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షల్లో చాలా అవకతవకలు జరిగాయని వాటిని సరిచేయాలని వారు విజ్ఞప్తి చేశారు. వారం లోపు తమను అర్హులుగా గుర్తించకపోతే తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరించారు. సోమా జిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అభ్యర్థులు ఎస్‌.వెంకటేశ్వర్లు, శిల్ప, మహేశ్, తదితరులు మాట్లాడుతూ.. పోలీస్‌ కానిస్టేబుల్, ఇతర విభాగాలకు సెప్టెంబర్‌ 30న నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రంలో కొన్ని ప్రశ్నలు తప్పుగా ఇచ్చారని తెలిపారు. ఈ ప్రశ్నలకు కొంతమందికి మార్కులు కలిపి, మరికొందరికి కలపలేదని దీంతో చాలామందికి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top