కాళేశ్వరానికి స్టేజ్‌–2 అనుమతి

కాళేశ్వరానికి స్టేజ్‌–2 అనుమతి - Sakshi


పర్యావరణ అనుమతులిచ్చిన కేంద్ర అటవీ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: మంథని నియోజకవర్గంలో 45 వేల ఎకరాలకు సాగునీరు అందిం చే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీశాఖ స్టేజ్‌–2 అనుమతి మంజూరు చేసింది. దీంతో 645 ఎకరాల అటవీ భూమి ని ప్రాజెక్టు పనుల కోసం వినియోగించుకోవడానికి అడ్డంకులు తొలగిపోయినట్లయింది.


గోదావరి నుంచి 4.5 టీఎంసీల నీటిని తీసుకుంటూ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌ మండల పరిధిలో 14 చిన్న నీటి చెరువులను నింపడం,తద్వారా 18,211 హెక్టార్లు (45,742 ఎకరాలు) ఆయకట్టుకు నీరిచ్చేలా రూ.499.23 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పంపింగ్‌ స్టేషన్, ప్రెషర్‌ మెయిన్, గ్రావిటీ కాల్వలను నిర్మించాల్సి ఉంది. ఇందుకు 258 హెక్టార్ల అటవీ భూమి అవసరమవగా ఇప్పటికే స్టేజ్‌–1 క్లియరెన్స్‌ వచ్చింది. స్టేజ్‌–2 క్లియరెన్స్‌ రాకపోవడంతో ఆరేళ్లుగా ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి.



మంత్రి హరీశ్‌ సమీక్ష...

కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 15,16 కింద చేపట్టాల్సిన పనులపై మంత్రి హరీశ్‌రావు గురువారం హైదరాబాద్‌లో సమీక్షించారు. ఈ ప్యాకేజీ పనుల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కాలువలు నిర్మించేందు కు అవసరమైన 8 వేల ఎకరాల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌ చివరికల్లా కాలువలకోసం భూసేకరణ చేయాలన్నారు.2018 జూన్‌లో యాదాద్రి భువనగిరి జిల్లాలో చెరు వులు నింపాల్సి ఉందన్నారు. ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top