విన్‌.. సోషల్‌ ప్రొటీన్‌

Social Media YLAC Counter Speech in Hyderabad - Sakshi

సిటీ యూత్‌లో వెరైటీ టాలెంట్‌లు ఎన్నో..

ఇన్‌స్టాగ్రామ్‌తో ప్రతిభా పాటవాల వెలికితీత   

సామాజిక మాధ్యమాల సద్వినియోగమే ధ్యేయం

వైఎల్‌ఏసీ ఆధ్వర్యంలో కౌంటర్‌స్పీచ్‌ ఫెలోషిప్‌

ఇంటర్నెట్‌ వేదికగాఅల్లుకుంటున్న స్నేహాలు ప్రతిభాసామర్థ్యాల సంగమాలుగా మారుతున్నాయి.యువతలోని విభిన్న రకాల టాలెంట్లను వెలుగులోకి తెస్తున్న సామాజిక మాధ్యమాలు సిటీనిసరికొత్త ఈవెంట్స్‌కి వేదికగా మారుస్తున్నాయి. అదే క్రమంలో కొన్ని దుష్పరిణామాలూ తప్పడం లేదు.ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌ ఆధ్వర్యంలో సోషల్‌ మీడియా సద్వినియోగంపై సిటీలో సోమవారం వైఎల్‌ఏసీ కౌంటర్‌ స్పీచ్‌ ఫెలోషిప్‌కార్యక్రమం నిర్వహించారు.

సాక్షి, సిటీబ్యూరో :రెండువైపులా పదునున్న కత్తి లాంటిది సోషల్‌ మీడియా అనడంలో అతిశయోక్తి లేదు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌.. ఇలా పేరేదైతేనేం నిమిషాల్లో మనల్ని ప్రపంచమంతా పరిచయం చేసే అత్యంత శక్తిమంతమైన సామాజిక మాధ్యమాల వేదికగా సోషల్‌ మీడియా ఇప్పుడు సిటీజనుల్ని పాదాక్రాంతం చేసుకుంది. అయితే, ఇది ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది. అందులో మరీ ముఖ్యంగా టీనేజ్‌ యువత చేతికి అందిన ఈ రాయి దేశాన్ని నిర్మిస్తుందో, భవిష్యత్తును దెబ్బ తీస్తుందో అని ఆందోళన వ్యక్తమవుతోంది.  

టీన్‌.. టెన్షన్‌..
అన్ని వయసుల వారూ సోషల్‌ మీడియా పట్ల క్రేజీగా ప్రతిస్పందిస్తున్నప్పటికీ.. ఎంతో భవిష్యత్తు ఉన్న టీనేజీ విషయంలోనే ఆందోళన అందరిలో వ్యక్తమవుతోంది. అవసరమైనవీ, అనవసరమైనవీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో దేన్ని ఎలా ఎంత వరకూ తీసుకోవాలి? మనకు అందుబాటులో ఉన్న అద్భుతమైన మా«ధ్యమాన్ని విజయాలకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలి?  క్షణంలో మన ప్రతిభ ప్రపంచవ్యాప్తం కావడం అనే అత్యంత సానుకూల అంశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? వంటి ప్రశ్నలకు సమాధానాలు అందించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ నిర్వాహకులు వైఎల్‌ఏసీ కౌంటర్‌ స్పీచ్‌ ఫెలోషిప్‌ పేరుతో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని డిజైన్‌ చేశారు.  

సిటీ నుంచి 35 మంది ఎంపిక...
యంగ్‌ లీడర్స్‌ ఫర్‌ యాక్టివ్‌ సిటిజన్‌షిప్‌ (వైఎల్‌ఏసీ)తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌ దేశవ్యాప్తంగా 2017లో ఈ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ రూపుదిద్దుకుంది. దీనిని నగరంలో సోమవారం ప్రారంభించింది. సోషల్‌ మీడియాను టీనేజర్లకు సురక్షితమైన, ఉపయుక్తమైన వేదికగా మార్చడమే దీని లక్ష్యమని, సిటీలో 35 మంది ఎంపికయ్యారని నిర్వాహకులు చెప్పారు.

ఇది మా బాధ్యత..
 టీనేజర్లకు ఇన్‌స్ట్రాగామ్‌ అంటే ఎంత అభిమానమో వేరే చెప్పనక్కర్లేదు. స్వీయ వ్యక్తీకరణకు, తమ ఇష్టాలను, అభిరుచులను పంచుకోవడానికిఇన్‌స్టాగ్రామ్‌పైనేఆధారపడుతున్నారు.  ఇందులో భాగంగానే ఈ కౌంటర్‌ స్పీచ్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ను డిజైన్‌ చేశాం. రెండునెలల ఈ ప్రోగ్రామ్‌ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు ప్రదానం చేస్తాం. గత రెండేళ్లలో 180 మంది ఈ కోర్సు పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి మేం అందుకున్న వందల దరఖాస్తుల్లో వడపోత అనంతరం 35 మందిని ఈ ఫెలోషిప్‌కి ఎంపిక చేశాం.  – తారాబేడి, ఇన్‌స్ట్రాగామ్‌ ఇండియా  

సోషల్‌ ఫ్రెండ్స్‌ కలిశారు..
నాలాంటి అభిరుచి కలిగిన ఎంతో మంది టీనేజర్లను కలవడం చాలా సంతోషంగా ఉంది. మీరు పిల్లలు మీకేం తెలీదు అంటూ అని తీసి పారేసే వారి ప్రమేయం లేకుండా సంభాషించడం చాలా బాగుంది. ఈ ప్రోగ్రామ్‌ కోసం మేమంతా సోషల్‌ మీడియా అకౌంట్లు ప్రారంభించి నిర్వహించాల్సి ఉంటుంది. సృజనాత్మకమైన, ఒరిజినల్‌ కంటెంట్‌ని పోస్ట్‌ చేయాలి. పద్యాలు, కార్టూన్స్, క్యారికేచర్స్‌ వంటిని పంచుకోవాలి. నిజానికి నేనో ఇంట్రావర్ట్‌ని. కానీ ఒక బృందంతో పనిచేస్తే అది నాలోని సంకోచాలను పోగొడుతుందని నమ్ముతున్నాను. – దేవుని వన్షిక, 9వ తరగతి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top