పసిమొగ్గలపై అకృత్యాలు

sexual abuse cases on childs - Sakshi

  కామాంధుల చేతుల్లో బాలికలు బలి

 ప్రతినెలా సగటున 12 మందిపై లైంగిక నేరాలు

 కేసులు నమోదవుతున్నా..శిక్షల విధింపులో తాత్సారం

 ఈ ఏడాదిలో 155 కేసులు నమోదు

కామాంధుల వెకిలిచేష్టలకు పసిమొగ్గలు బలవుతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రభుత్వాలు స్త్రీ రక్షణ కోసం ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినా.. తీరుమారడం లేదు. కామాంధుల కబంధ హస్తాల్లో బాలికలు నలిగిపోతున్నారు. పసితనం నుంచే బాలికలు లైంగిక వస్తువుగా మారుతుండడం పట్ల సభ్యసమాజం తలదించుకుంటోంది.
     
   
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దేవునితో సమానులైన పసిమొగ్గలు.. దుర్మార్గుల చేతిలో లైంగిక దాడికి గురవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో నెలకు సగటున 12 మంది బాలికలు.. కామాంధుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నారు. లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించేలా చట్టం వచ్చినా.. బాలికలకు రక్షణ ఉందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అధిక శాతం తెలిసిన వ్యక్తులే బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవరిస్తున్నారు.

ఇరుగు పొరుగు, బంధువులు, తల్లిదండ్రుల స్నేహితులే.. బాలికల పట్ట క్రూరమృగాలుగా మారుతున్నట్లు జిల్లాలోని ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. రక్షణ కవచంలా ఉండాల్సిన తండ్రులే.. పితృత్వానికి మచ్చ తెచ్చేలా రాక్షసులుగా మారిన దాఖలాలూ ఉన్నాయి. ఇలా ఏడాది కాలంలో మొత్తం 155 మంది బాలికలపై లైంగికదాడులు, అత్యాచార యత్నాలు, అసభ్యకర ప్రవర్తన ఘటనలు జరగడం బాధాకరం. అత్యధికంగా రాజేంద్రనగర్, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, ఆమనగల్లు, సరూర్‌నగర్, శేరిలింగంపల్లి, చందానగర్‌ ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 

శిక్షలు డీలా.. 
18 ఏళ్లలోపు చిన్నారులను లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించేలా పోక్సో–2012 చ ట్టం ఉన్నా.. దాని ప్రభా వం పెద్దగా కనిపించడం లేదు. కేసులు నమోదవుతున్నా.. విచారణలో ఎడతెగని జా ప్యం కారణంగా కొలిక్కి రా వడం లేదు. ఒక్కో కేసు వి చారణ, తీర్పు పూర్తికావడానికి కనీసం మూడేళ్లు పడుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా నిందితులకు శిక్ష ఖరారులోనూ ఆలస్యమవుతోంది. బెయిల్‌పై వచ్చిన నిందితులు స్వేచ్ఛగా అందరిలాగే సమాజంలో తి రుగుతున్నారు.

గత మూడేళ్లలో ఏడాదికి సగటున 150పైగా కేసులు నమోదైనా.. ఇందులో శిక్షలు పడినవి వేళ్లపైనే లెక్కించవచ్చని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇంతటి తాత్సారానికి చెక్‌పెట్టి వీలైనంత త్వరలో నేరాన్ని నిరూపించి శిక్ష విధిస్తే పరిస్థితిలో కొంతైనా మార్పు ఉండేదన్న పలువురు అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తల్లిదండ్రుల ఆలోచనా తీరు, ప్రవర్తనలోనూ మార్పు ఉంటేనే.. కొంతవరకైనా బాలికలను రక్షించుకోవచ్చు. తమ బిడ్డలను ఒంటరిగా విడిచిపెట్టడం, ఒకరికి అప్పగించడం వంటి పనులకు దూరంగా ఉండాలి.
 

బాలికలపై లైంగిక నేరాలు ఇవీ..

నెల                 సైబరాబాద్‌ కమిషనరేట్‌   రాచకొండ కమిషనరేట్‌  
మార్చి(2017)               8                              4 
ఏప్రిల్‌                           13                             5     
మే                                6                              3 
జూన్‌                             9                              3 
జూలై                           11                             2 
ఆగస్టు                         10                             6 
సెప్టెంబర్‌                       6                               6 
అక్టోబర్‌                       16                              2 
నవంబర్‌                      10                             1 
డిసెంబర్‌                      9                               7 
జనవరి(2018)             6                               5 
ఫిబ్రవరి                        4                                3

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top