వైభవంగా రోశయ్య మనవడి పెళ్లి

Rosaiah Grandson wedding - Sakshi

లేఖలో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

హైదరాబాద్‌: తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మనవడు ‘హర్ష, రూపవాణి’ల వివాహం శనివారం హైటెక్స్‌లో ఘనంగా జరిగింది.  ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. గవర్నర్‌ నరసింహన్, సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, అచ్చెం నాయుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి,  ఎంపీ సీఎం రమేశ్, సినీనటుడు సుమన్, తెలంగాణ మంత్రులు హరీశ్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌.జైపాల్‌ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్‌ నాయకులు దానం నాగేందర్, ‘సాక్షి’ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌  కె.రామచంద్రమూర్తి, కనుమూరి బాపిరాజు, కావూరి సాంబశివరావు, తదితరులు ఈ  వివాహ వేడుకకు హాజరయ్యారు. ప్రధాని శుభాంక్షలు...: నూతన దంపతులను ఆశ్వీరదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు ఆయన రోశయ్యకు లేఖ రాశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ కోశాధికారి మోతీలాల్‌ ఓరా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top