ఒకేసారి తప్పిన పెను ప్రమాదాలు

Road Accident In Kodada - Sakshi

సాక్షి, కోదాడ : ఇద్దరు వాహనదారులు చాకచక్యంగా వ్యవహరించడంతో శనివారం  పెను ప్రమాదాలు తప్పాయి. వివరాలలోకి వెళ్తే ..మండల పరిధిలోని దోరకుంట శివారులో గల అశోక్‌లేలాండ్‌ లోకి వెళ్తేందుకు లారీ జాతీయ రహదారి నుంచి మలుపు తిరుగుతుంది.  అదే సమయంలో కోదాడ నుంచి ద్విచక్రవాహనంపై నల్లబండగూడెం వెళ్తున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా లారీ మలుపును గమనించకుండా    దాని వెంటనే వెళ్లడంతో అది పూర్తిగా  లారీ మధ్యటైర్ల కిందకు వెళ్లింది. దీంతో బైక్‌పై ఉన్న అతను ఒక్కసారే దానిని వదిలేసి పక్కకు దూకాడు. ఈ ప్రమాదంలో బైక్‌ పూర్తిగా నుజ్జు అయింది. అదే సమయంలో అటుగా చూసుకుంటు   విజయవాడ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డుకిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూడా ఎవరకు గాయడలేదు. పోలీసులు వచ్చి వాహనాలను బయటకు తీసి పంపించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top