క్రీ.శ.1587 నాటి శాసనం లభ్యం

Researchers identified statue at Nagar Kurnool District  - Sakshi

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో గుర్తించిన పరిశోధకులు

కందనూలు: నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్ర చెరువు నిర్మాణానికి సంబంధించిన క్రీ.శ.1587 నాటి శాసనం బయటపడింది. వెన్నెల సాహిత్య అకాడమీకి చెందిన సభ్యులు చెరువు కట్టపై కొద్ది రోజులుగా పరిశోధన చేస్తున్నారు. ఈ సందర్భంగా శాసనం వెలుగు చూసిందని అకాడమీ సభ్యులు వనపట్ల సుబ్బయ్య, దినకర్‌ గురువారం విలేకరులకు తెలిపారు.

గోల్కొండ సుల్తాన్‌ ఖులీకుతుబ్‌షా పాలన కాలంలో సుల్తాన్‌ ఆజ్ఞ మేరకు మహల్‌దార్‌ షేర్‌ మహ్మద్‌ కందనూలు (నాగర్‌ కర్నూల్‌)కు వచ్చి కేసరి సముద్రం చెరువు తవ్వకాల్లో భాగంగా 1587లో తూముల నిర్మాణాన్ని చేపట్టినట్లు ఈ శాసనంపై ఉందని పేర్కొన్నారు. శాసనం వివరాలను ప్రముఖ చరిత్రకారుడు, పరిశోధకుడు ఎస్‌.హరగోపాల్‌కు వివరించడంతో పాటు శాసనాన్ని నాగర్‌ కర్నూల్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ఈ పరిశోధనలో వెన్నెల సాహిత్య అకాడమీ సభ్యులు గుడిపల్లి నిరంజన్, ఆంగోతు వెంకట్‌ పవార్, మోహన్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top