కేన్సర్‌ను జయించిన వారే హీరో

Rakul Preet Singh launch Cancer Survivor Book in Hyderabad - Sakshi

హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌

‘నేను కేన్సర్‌ని జయించాను’ పుస్తకావిష్కరణ

సోమాజిగూడ: సినీ జీవితంలో హీరోహీరోయిన్లుగా తాము నటిస్తామని, కానీ కేన్సర్‌ను జయించి విజేయులైన మీరే నిజమైన హీరోలని హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. అపోలో ఆస్పత్రి కేన్స్‌ర్‌ వైద్యుడు డాక్టర్‌ పాలకొండ విజయ్‌ ఆనంద్‌రెడ్డి రచించిన ‘ఐ యామ్‌ సర్వైవర్‌’ ఆంగ్ల పుస్తకాన్ని ‘నేను కేన్సర్‌ని జయించాను’ తెలుగు అనువాదాన్న్సాదివారం హోటల్‌ ఐటీసీ కాకతీయలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఆవిష్కరించి మాట్లాడారు. అనంతరం కేన్సర్‌ బాధితురాలు చిన్నారి శ్రావణ సంధ్యతో కేకును కట్‌ చేయించారు. డాక్టర్‌ విజయ ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ.. కేన్సర్‌ వ్యాధి నిర్థారణకు రాక ముందే వారిలో ఆందోళన, భయం పెరుగుతోందని, తాను ఎన్నో రకాల కేన్సర్లతో భయపడేవారిని చూశానన్నారు.

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డాక్టర్‌ విజయ్‌ ఆనంద్‌రెడ్డి, రకుల్‌ప్రీత్‌ సింగ్,వెంకటపతి రాజు, అపోలో గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి
వారి భయాన్ని పోగొట్టేందుకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కేన్సర్‌ వస్తే మరణిస్తామన్న అపోహ చాలామందిలో ఉందని, ఈ వ్యాధి జయించి విజేయులైన 108 మంది జీవితాలను పుస్తక రూపంలో తెచ్చినట్టు చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న భారత మాజీ క్రికెటర్‌ వెంకటపతిరాజు క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ వీడియోను ఆవిష్కరించి ప్రసంగించారు. అపోలో గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి, తెలుగు అనువాదకులు డాక్టర్‌ దుర్గంపూడి చంద్రశేఖరరెడ్డి, డాక్టర్‌ గోవిందరాజు చక్రధర్, ఎమెస్కో అధినేత విజయ్‌కుమార్, ప్రొఫెసర్‌ రఘురామరాజు, డాక్టర్‌ కౌశిక్‌ భట్టాచార్య మాట్లాడారు. అనంతరం కేన్సర్‌ వ్యాధిని జయించిన భావన, ఆదిలక్ష్మి, సుజాత వారి మనోగతాన్ని వివరించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top