రాజీవ్‌గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి

Rajiv Gandhi To Should Be Taken Ideally - Sakshi

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క

ఖమ్మం, సహకారనగర్‌: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ అనేక సంస్కరణలు చేసి ప్రజలకు లబ్ధి జరిగేలా ప్రయత్నించారని, ఆయన్ను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్‌లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, నాయకుడు పోట్ల నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కార్పొరేటర్లు బాలగంగాధర్‌తిలక్, వడ్డెబోయిన నర్సింహారావు, ముస్లిం మైనార్టీ జిల్లా కన్వీనర్‌ తాజుద్దీన్, నాయకులు కొత్తా సీతారాములు, ఎండీ ఫజల్, జావీద్, బాబా, మలీదు వెంకటేశ్వర్లు, కల్వకుంట్ల గోపాల్, లక్ష్మీనర్సయ్య, రాధాకృష్ణ, మద్ది వీరారెడ్డి, జానీ, యాకూబ్‌పాషా, మహిళా అధ్యక్షురాలు బండి మణి, అనంతలక్ష్మి, భవాని, వినోద తదితరులు పాల్గొన్నారు. 

యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో...  

యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ 27వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం లోక్‌సభ యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రాపర్తిశరత్‌ ఆధ్వర్యంలో బైపాస్‌రోడ్డులో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో రాపర్తి సత్యనారాయణ, మేకల క్రాంతికుమార్, తోట సాయికృష్ణ, నర్సింగ్‌ ప్రసాద్, బబ్లూ, ఎస్‌కే ఖాసీం, ఉపేందర్, భుక్యా శ్రీను, సునీల్, రంగనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 

రాజీవ్‌గాంధీకి ఘన నివాళి 

కామేపల్లి: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 27వ వర్ధంతిని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కామేపల్లి, జాస్తిపల్లి గ్రామాల్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళలలర్పించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు అంతోటి అచ్చయ్య మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేశారని తెలిపారు.

కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రాయల భాస్కర్‌రావు, ఎస్టీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు అజ్మీర రాందాస్‌నాయక్, మండల కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు మల్లెంపాటి శ్రీనివాసరావు, దేవెండ్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top