ఆకలి చావులను పట్టించుకోని సీఎం

ఆకలి చావులను పట్టించుకోని సీఎం


కేసీఆర్‌ తీరుకు నిరసనగా రాజీనామా చేస్తున్నా: రాజాసింగ్‌లోథా

హైదరాబాద్‌: ధూల్‌పేట్‌లో గుడుంబా మానేసిన వేలాదిమంది ప్రత్యామ్నాయ ఉపాధి లేక ఆకలి చావులు చస్తున్నా సీఎం పట్టించుకోవడంలేదని గోషామహల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథా అన్నారు. కేసీఆర్‌ తీరుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నానని.. ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. మంగళవారం సీఎంను కలసి రాజీనామా లేఖను అందజేస్తానని చెప్పారు.


రెండేళ్ల క్రితమే కేసీఆర్‌ను అసెంబ్లీలో తాను ప్రశ్నిస్తే ధూల్‌పేట్‌కు స్వయంగా వస్తానని, వారిని అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారని, అది నేటికీ నెరవేరలేదన్నారు ఎక్సైజ్‌ ఏఈఎస్‌ అంజిరెడ్డి ఆగడాలపై సీఎం, మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నారు. సీఎం వెంటనే ధూల్‌పేట్‌ను సందర్శించి ఉపాధిలేని కుటుంబాలకు న్యాయం చేయాలని, లేకుంటే తన రాజీనామాను ఆమోదించాలని అన్నారు.

Back to Top