రానున్న మూడ్రోజులు తేలికపాటి వర్షాలు 

Rains Expected across Telangana Over Next Three Days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తీవ్రమైన వడగాడ్పులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 45 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే హకీంపేట్‌లో (మల్కాజిగిరి) 7 సెం.మీ., అసిఫాబాద్‌లో (కుమరం భీం) 4 సెం.మీ., హైదరాబాద్‌లో 2 సెం.మీ., షాద్‌నగర్‌లో (రంగారెడ్డి) 1 సెం.మీ., శామీర్‌పేట్, నర్సాపూర్, లింగంపేట తదితర ప్రాంతాల్లో 1 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top