మీ వయసులో కలెక్టర్‌ని కొట్టిన

r krishnaiah in BC Student Association Council meeting - Sakshi

బీసీ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య

హైదరాబాద్‌: ‘మీ వయసులో ఒక్కడినే పోరాటం చేశాను. అడ్డొచ్చిన కలెక్టర్‌ని కొట్టాను. ఆర్డీవో కార్యాలయానికి తాళాలు వేశాను. బీసీల రాజ్యాధికారం కోసం నాలాగే మీరూ చేయాలి’ అని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. గురువారం ఇక్కడ జరిగిన తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏటా యాజమాన్యాలు ఫీజులు పెంచుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రభుత్వం మొత్తం ఫీజులను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. హాస్టల్‌ విద్యార్థుల కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలన్నారు. రెండేళ్ల పాటు విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్‌పై ఉచిత శిక్షణ ఇవ్వాల న్నారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్‌ ఇవ్వాలన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తనకు ఎలాంటి సాయం చేయలేదన్నారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకోనన్నారు. ఈ సభలో బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ర్యాగ అరుణ్, నీలం వెంకటేశ్, రామకృష్ణ, రామలింగం తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top