వైద్యం అందక గర్భిణి మృతి

Pregnant Women Died With Doctors Negligence - Sakshi

ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన

కుషాయిగూడ: సకాలంలో వైద్యం అందక ఓ గర్బిణి మృతి చెందిన సంఘటన బుధవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..యాదాద్రి జిల్లా, బొమ్మలరామారం మండలం,  వాలుతండాకు చెందిన గర్బిణి శాంతాబాయి  ఈ నెల 29న అనారోగ్యంతో బాధపడుతూ ఈసీఐఎల్‌లోని  ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతున్న ఆమె బుధవారం మృతిచెందింది.  వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, డబ్బులు చెల్లించనందున వైద్యసేవల్లో జాప్యం చేయడంతో శాంతబాయి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబసభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి యాజమాన్యంపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సమాచారం అందడంతో అక్కడికి వచ్చిన లంబాడి హక్కుల పోరాటసమితి నాయకులు మృతురాలి కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపారు. దీంతో దిగివచ్చిన యజమాన్యం  రూ: 3 లక్షలు పరిహారం చెల్లించడంతో వారు ఆందోళన విరమించారు.

డెంగీతో యువకుడి మృతి
భాగ్యనగర్‌కాలనీ: డెంగీ వ్యాధితో బాధపడుతూ ఓ యువకుడు  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన కూకట్‌పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జగద్గిరి గుట్టకు చెందిన రాజ్‌కుమార్‌ (23) సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నాడు.  జూలై 25న డెంగీతో బాధపడుతున్న అతపు కూకట్‌పల్లి లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం రాత్రి ప్లేట్‌లెట్లు తగ్గిపోవటంతో మృతి చెందాడు.  వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని తల్లిదండ్రులు, బంధువులు,  ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి సర్థిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top