కాంగ్రెస్‌పై విమర్శలు మూర్ఖత్వం: పొన్నం

కాంగ్రెస్‌పై విమర్శలు మూర్ఖత్వం: పొన్నం


కరీంనగర్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి అడ్డుపడుతోం దని పదేపదే విమర్శలు చేయడం తగదనీ, దమ్మూ ధైర్యం ఉంటే మీరు చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ మంత్రి హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు. ఈమేరకు గురువారం హరీశ్‌కు బహిరంగ లేఖ రాశారు.


ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో కాలయాపన చేస్తూ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్లను కొల్లగొడుతూ నీటిపారుదల రంగాన్ని భ్రష్టు పట్టించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. ‘నీటిపారుదల అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, లేదంటే బహిరంగ చర్చకు రావాలని సవాలు చేశారు.

Back to Top