బుల్లెట్‌పై పో(ప్ర)చారం..!

Pocharam Srinivas Reddy Election Campaign In Nizamabad - Sakshi

బాన్సువాడ (నిజామాబాద్‌): 68 ఏళ్ల వయస్సులోనూ యువకుడిలా ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి. వయస్సు రీత్యా ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించగా, బరిలో నిలవాల్సిందేనంటూ సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో ఆయన రెట్టింపు ఉత్సాహంతో పోటీకి సిద్ధమవుతున్నారు.

ప్రచారానికి ప్రత్యేక వాహనాన్ని తెప్పించినా, దాన్ని పక్కన పెట్టిన పోచారం.. సోమవారం వర్ని మండలం చింతకుంట, నెహ్రూనగర్, తిమ్మాపూర్‌ గ్రామాల్లో బుల్లెట్‌పై ప్రయాణిస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకొంటూ ముందుకు సాగారు. 

వంద సీట్లు గెలుస్తాం
వర్ని(బాన్సువాడ): అభివృద్ధి సాధకులకు, అభివృద్ధి నిరో«ధకులకు మధ్య ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయని వ్యవసాయ మంత్రి, బాన్సువాడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చింతకుంట, తిమ్మాపూర్, నెహ్రూనగర్‌ గ్రామాల్లో సోమవారం ఆయన బైక్‌పై తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతు సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఓర్వ లేని ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు 196 కేసులు వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు 30 ఉత్తరాలు రాశాడని విమర్శించారు. అయినప్పటికీ కోటి ఎకరాలకు సాగు నీరందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

ప్రాజెక్టుల వల్ల నిజాంసాగర్‌ ఆయకట్టు, రివర్స్‌ పంపింగ్‌ ద్వారా శ్రీరాంసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. జిల్లాలో ని అలీసాగర్‌ ఎత్తు పెంచుతామని, దీంతో బ్యాక్‌ వాటర్‌ ద్వారా మండలంలోని పలు గ్రామాలకు సాగర్‌ కాలువ ద్వారా సాగునీరు అందుతుందన్నారు. 100 సీట్లకు పైగా గెలిచి టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీ మా వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ విజయభా స్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మే క వీర్రాజు, కార్యదర్శి నరెడ్ల నర్సింహులు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ నారోజి గంగారాం, విండో చైర్మెన్లు అప్పిరెడ్డి, హన్మంత్‌రెడ్డి, నేమాని వీర్రాజు, నాయకులు పాల్గొన్నారు.

 

నామినేషన్‌ కోసం రైతు విరాళం 
ఎన్నికల్లో నామినేషన్‌ వేయడానికి వర్ని మండలం నెహ్రూనగర్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఓ రైతు రూ.25వేలు విరాళంగా అందచేశారు. ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడానికి కాలువల వెంట పర్యటించడం, నిజాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయించినందుకు గాను నామినేషన్‌ ప్రక్రియ కోసం రూ.25వేలు ఇస్తున్నట్టు నెహ్రూనగర్‌ రైతు అప్పసాని లక్ష్మణ్‌రావ్‌ తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top