ఓయూలో రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరణ

Permission Denied To Rahul Gandhi Visit To Osmania University - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్శిటీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభకు వైస్‌ ఛాన్సలర్‌ అనుమతి నిరాకరించారు. కాగా ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం ఓయూ క్యాంపస్‌ను రాహుల్‌ గాంధీ సందర్శించనున్నారని కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా వీసీ అనుమతి నిరాకరించారు. అయితే రాహుల్‌ గాంధీ పర్యటనను ఓయూ అధికారులు నిరాకరించడాన్ని నిరసిస్తూ ఐక్య విద్యార్థి సంఘాలు ఓయూలోని వీసీ చాంబర్‌లో బైఠాయించారు. రాహుల్‌ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని వారు నినాదాలు చేశారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top