నాసా ‘రేస్‌’లో ఓరుగల్లు స్టూడెంట్స్‌

NASA selects Telangana students - Sakshi

చంద్రుడిపై నడిచే వాహనాన్ని రూపొందించిన వరంగల్‌ విద్యార్థులు

నాసా ‘రేస్‌’లో ఓరుగల్లు స్టూడెంట్స్‌

చంద్రుడిపై నడిచే వాహనం డిజైన్‌

ఫైనల్స్‌కు ఎంపిక చేసిన నాసా

2018 ఏప్రిల్‌లో తుది పోటీలు

తాండ్ర కృష్ణగోవింద్‌:  రోబోటిక్‌ సబ్జెక్ట్‌పై ఇంట్రస్ట్‌ వారిని నూతన ఆవిష్కరణ వైపు అడుగులు వేయించింది. చంద్రుడిపై నడిచే వాహన రూపకల్పనకు నాంది పలి కింది. వీరు తయారు చేసిన వాహ నం వేలాది ఎంట్రీలను దాటుకుని తుదిపోరుకు అడుగు దూరంలో నిలిచింది. ప్రఖ్యాత ‘నేషనల్‌ ఏరో నాటిక్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా, అమెరికా)’ సంస్థ నిర్వహించిన పోటీలో వరంగల్‌ విద్యార్థులు ఫైన ల్స్‌కు ఎంపికయ్యారు. నాసా సంస్థ నిర్వహిస్తోన్న హ్యూమన్‌ ఎక్స్‌ప్లోరే షన్‌ రోవర్‌ ఛాలెంజ్‌ పోటీలో వరంగల్‌ విద్యార్థులు రూపొందిం చిన వాహనం నమూనాను 2018 ఏప్రిల్‌లో అమెరికాలో జరిగే ఫైనల్‌ పోటీలో ప్రదర్శించనున్నారు. 

 ఈ ఏడాది డిసెంబరు చివరి వరకు వాహనం ప్రోటోటైప్‌ను సిద్ధం చేయనున్నారు. తుది నమూనాను  2018 ఏప్రిల్‌ 12 నుంచి 14 వరకు అమెరికాలోని హ్యూస్టన్‌ విల్లేలో ఉన్న అలబామా యూనివర్సిటీలో ప్రదర్శిస్తారు. 

చంద్రుడిపై నడిచే వాహనం తయారీలో అక్కడి గురుత్వాకర్షణ శక్తి, ఉపరితలం అంశాలను ప్రాథమికంగా తీసుకు న్నాం. పెట్రోల్, డీజిల్‌ తదితర ఇంధనాలు వాడ కూడదనే నిబంధన కారణంగా తక్కువ బరువు, స్టీరింగ్‌ మెకానిజం తదితర అంశాలపై ఫోకస్‌ చేశాం. దాదాపు రెండు నెలల పాటు వివిధ  జైన్లు ఆటోక్యాడ్‌లో చేశాం. చివరకు ఓ మోడల్‌ను సిద్ధం చేశాం. ఇందులో మా మెంటార్‌ మనోజ్‌  సహకారం అందించారు.  
దిలీప్‌రెడ్డి, జట్టు సభ్యుడు

భారత్‌ నుంచి నాలుగే ఎంట్రీలు..

 నాసా పంపిన అపోలో రోదసీ వాహన నౌక తొలిసారిగా 1969లో చంద్రుడిపైకి చేరుకుంది. నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై పాదం మోపాడు. 

♦ ఇది జరిగిన 25 ఏళ్లకు..1994లో నాసా సంస్థ çహ్యూమన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ రోవర్‌ ఛాలెంజ్‌ పోటీలు నిర్వహించింది. అప్పటి నుంచి ప్రతీ ఐదేళ్లకు ఓ సారి అంతరిక్షానికి సంబంధించిన అంశాలపై పోటీలు నిర్వహిస్తూ వస్తోంది. 

♦ తాజాగా 2017 మేలో నాసా మరోసారి పోటీలను నిర్వహించింది. చంద్రుడిపై ఎటువంటి ఇంధనం లేకుండా ఇద్దరు మనుషులు, ఇందులో ఒక పురుషుడు, ఒక స్త్రీ ఉండే విధంగా ప్రయాణించే వాహనం డిజైన్‌ను వరంగల్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు రూపొందించారు. 

♦  ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఫైనల్‌ ఇయర్‌కు చెందిన పాల్‌వినీల్‌ (ఈసీఈ), రాయినేని ప్రకాశ్‌ (మెకానికల్‌), పి.శ్రావణ్‌రావు (ఈసీసీ), రోండ్ల దిలీప్‌రెడ్డి (మెకానికల్‌), వి.స్నేహ (సివిల్‌) బృందం చంద్రుడిపై సురక్షితంగా ప్రయాణించగలిగే మూన్‌బగ్గీ డిజైన్‌ను నాసా పోటీలకు పంపించారు.

♦ వీరు వివిధ ఇంజనీరింగ్‌ విభాగాలకు చెందిన వారైనా కామన్‌ ఇంట్రస్ట్‌ రోబోటిక్స్‌. ఇదే సమ యంలో నాసా మూన్‌రోవర్‌ కాంటెస్ట్‌ గురించి తెలియడంతో.. వాహనాన్ని డిజైన్‌ చేశారు.

♦ ఈ పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా 23 దేశాలకు చెందిన సుమారు పదివేల మంది విద్యార్థులు పలు రకాల నమూనాలు పంపారు. వీటిని పరిశీలించిన నాసా బృందం భారత్‌ నుంచి మొత్తం నాలుగు డిజైన్స్‌ను ఫైనల్‌కు ఎంపిక చేసింది. ఇందులో వరంగల్‌ ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ బృందం రూపొందించిన నమూనా ఉండడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top