ఏం తింటున్నరో.. ఎలా ఉన్నరో!

Nalgonda Students Stuck in New York City Parents Worried - Sakshi

 కరోనా విజృంభిస్తుండడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన

ఫోన్, వీడియోకాల్‌ సంభాషణతోనే సంతృప్తి

అక్కడుంటున్న వారూ భయంభయంగా..

చౌటుప్పల్‌కు చెందిన పో లీస్‌ పటేల్‌ రెండో కుమార్తె చింతల ధనలక్ష్మికి వలిగొండ మండలం అక్కెనపల్లికి చెందిన సుధాకర్‌రెడ్డితో 12 ఏళ్ల కిత్రం వివాహం జరి గింది. దంపతులిద్దరూ సా ఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కావడంతో వివాహ అనంతరం ఉద్యోగ నిమిత్తం న్యూయార్క్‌ వెళ్లారు.న్యూయార్క్‌కు 30 మైళ్ల దూరంలోని సయోస్సెట్‌ సిటీలోని సొంత ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు జ న్మించారు. పెద్దకుమార్తె అక్కడే 5వ తరగతి చదువుతుండగా చిన్నకూతురు చౌటుప్పల్‌లో నర్సరీ చదువుతుంది. ఏడాదికి, రెండేళ్లకో దంపతులిద్దరూ సొంతూర్లకు వచ్చిపోతుంటారు. అమెరికాలో కరోనా విజృంభిస్తుండడంతో అన్ని రకాల కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.దీంతో ప్రజ లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. 

సయోస్సెట్‌ పట్టణంలో రోజూ 40 నుంచి 50 పాజిటీవ్‌ కేసులు నమోదవుతుండడంతో సుధాకర్‌రెడ్డి దంపతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మంగళవారం ‘సాక్షి’ వారితో ఫోన్‌లో మాట్లాడగా కరోనా పేరు వింటేనే వణుకు వస్తుందని, ప్రతి రోజూ వేలాది మంది కరోనా బారిన పడుతున్నారని, మృతుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళనగా ఉందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. యూఎస్‌తో పోలిస్తే భారత్‌లో, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందన్నారు. ఇక్కడుంటున్న తమను స్వదేశానికి పంపించాలని అమెరికా నిర్ణయిస్తే సంతోషంగా వచ్చి అంతా సద్దుమణిగాకే వెళ్తామన్నారు. తమ కుటుంబ సభ్యులతో రోజూ రెండు,మూడు పర్యాయాలు ఫోన్‌లో మాట్లాడుతున్నామన్నారు. యూఎస్‌లో పరి స్థితిని తలుచుకుంటేనే ఎంతో భయంగా ఉందన్నారు.

కొడుకుతో మాట్లాడంది నిద్రపట్టడం లేదు
మాది మోటకొండూర్‌ మండలం మేడికుంటపల్లి. మాకు కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు ప్రవీణ్‌రెడ్డి(36) బీటెక్‌ చేసి ఐటీ రంగలో పన్నెండే ళ్లుగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉద్యోగం చేస్తున్నా డు. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకుని అక్కడే ఉంటున్నాడు. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుందని టీవీలు, సోషల్‌ మీడియాలో చూస్తూ వణికిపోతున్నాం.రోజూ వీడి యోకాల్‌లో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకుంటున్నాం. పరి స్థితి బాగాలేదని బయటకు రావద్దని అబ్బాయి మా కు చెబుతున్నాడు.కొడుకుతో రోజూ మాట్లాడక పో తే నిద్రపట్టటం లేదు.మార్చి మొదటి వారంలో మే ము కొడుకు వద్దకు వెళ్లాలని వీసా తీసుకున్నాం. ఆధార్‌ కార్డులో తప్పు దొర్లడంతో మార్చేందుకు సమయం పట్టింది. ఈ లోగా లాక్‌డౌన్‌ విధించడంతో ఇక్కడే ఉండిపోయాం. మా కొడుకున్న ప్రాంతంలో  కరోనా ప్రభావం లేకున్నా ఆందోళనగా ఉంది.    –పులగం అంజిరెడ్డి – సుజాత దంపతులు

సాక్షి, యాదాద్రి : విదేశాల్లో చదువు, ఉద్యోగం, వ్యాపారం, బంధువుల వద్దకు వెళ్లి లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయిన వారి పరిస్థితి దయనీయంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా వందలాది కుటుంబాల్లో ఇదే ఆందోళన నెలకొంది. ఉన్నతమైన జీవితాన్ని, ఉపాధిని వెతుక్కుంటూ వి«విధ రంగాల్లో బతుకు దెరువు కోసం వెళ్లిన వారిలో వేలాది మంది ఉన్నారు.  పనికోసం, డ్రైవర్, షాపుల్లో పనిచేసేందుకు వెళ్లిన వారు కొందరైతే.. ఉన్నత చదువుల కోసం, మెరుగైన ఉద్యోగాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్టవేర్‌ కంపెనీల్లో పనిచేసేందుకు వెళ్లిన వారు కొందరు ఉన్నారు.. ఇంత కాలం తమ బిడ్డ ఇతర దేశాల్లో ఉన్నాడన్న ధీమాతో ఉన్న తల్లిదండ్రులు నాలుగు రాళ్లు సంపాదిస్తున్నాడని అని «భావించిన తల్లిదండ్రులు ఇప్పుడు డబ్బులు వద్దు.. ఆ జీవితం వద్దు.. ఇంటికి రా బిడ్డ అని ప్రతీ రోజూ ఫోన్‌లో కన్నీరు పెడుతున్నారు. ప్రపంచ దేశాల్లో విస్తరిస్తున్న కరోన నేపధ్యంలో ఇంటికి రావాలని ఉన్నా లాక్‌ డౌన్‌తో రాలేకపోతున్న దయనీయ పరిస్థితిలో ఉన్నారు. అయినా జాగ్రత్తలు తీసుకుంటున్నాం మాకేం కాదంటు కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని నూరి పోస్తున్నారు ఎన్నారైలు.

సుధాకర్‌రెడ్డి దంపతులతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న కుటుంబసభ్యులు
వారి ఆవేదన వర్ణనాతీతం
యాదాద్రి  జిల్లా నుంచి అరబ్‌ దేశాలతోపాటు పశ్చిమ దేశాలకు వెళ్లారు. తీవ్ర కరువుపీడిత ప్రాంతమైన జిల్లా నుంచి బతుకు దెరువు కోసం ఆఫ్రికా దేశాలకు వెళ్లిన వారున్నారు. దుబాయ్, మస్కట్, సౌదీ, రియాద్, ఇటలీ, యూఎస్‌ఏ, ఇంగ్లండ్, రష్యా, చైనా, కొరియా ఆస్ట్రేలియా, కెనాడా, ఉగాండ, జార్జీయ, సైప్రస్, జర్మనీ  దేశాల్లో ఉన్నారు. ఇందులో చదువుకోసం, ఉన్నత ఉద్యోగం కోసం వెళ్లిన వారు కొందరు ఉంటే కూలీ పనికోసం వెళ్లిన వారు ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, ఆత్మకూర్‌ఎం. గుండాల అన్ని మండలాల నుంచి  విదేశాల్లో ఉన్నారు. అరబ్‌ దేశాల్లో కూలీ పనుల కోసం వెళ్లిన వారంతా భార్య,పిల్లలను, తల్లిదండ్రులను  చూడడానికి  రెండు మూడు సంవత్సరాలకో మారు వచ్చి వెళ్తుంటార. అదేవిధంగా ఉన్నత ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడిన వారు కుటుంబ సమేతంగా అక్కడే స్థిరపడగా వారి  తల్లిదండ్రులు, అత్తా మామలు ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం కరోనా ప్రపంచంలోని అన్నిదేశాలకు విస్తరించగా దేశం కాని దేశంలో ఉన్న తమ వారు ఏలా ఉన్నారో ఎప్పుడోస్తాడోఅని ఐనవారికోసం ఇక్కడి వారు ఆందోళన చెందుతున్నారు.. కరోనా ఆంక్షలు ఎత్తివేస్తే పిల్లలను  రమ్మని కబురు పెడుతున్నారు. ఇప్పుడు వీలుంటే రావాలని కోరుతున్నారు.

ప్రతి రోజూ యోగ క్షేమాలపై ఆరా
ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వాట్సప్‌ కాలింగ్‌లో అక్కడి వారి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లలో పరస్పరం సంభాషించుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. అంతా సర్దుకుంటుందని తమకేమీ కాదని విదేశాల్లో ఉన్నవారు చెబుతున్నా ఇక్కడివారి ఆవేదన తగ్గించలేకపోతున్నారు. తల్లిదండ్రులను ఓదార్చ డం ఇబ్బందిగా మారింది. ఎలాగైనా ఇంటికి రమ్మ ని కోరుతున్నారు. లాక్‌డౌన్‌ నేప«థ్యంలో రాలేమని లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే వస్తామని హామి ఇస్తున్నారు. విదేశాల్లో ఉన్న తమ పిల్లలను చూడడానికి వెళ్లిన పలువురు అక్కడే చిక్కుకుపోయారు. అక్కడ ఉద్యోగాలు చేస్తున్న తమ పిల్లల వద్దకు వెళ్లిన వారు అక్కడే చిక్కుకుపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top