ప్రజల పాలిట శాపంగా టీఆర్‌ఎస్‌ పాలన: నాగం

ప్రజల పాలిట శాపంగా టీఆర్‌ఎస్‌ పాలన: నాగం


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్‌ పాలన శాపంగా మారిందని, అధికారంలోఉన్నవారు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఎక్కడైనా చర్చలో పాల్గొనేందుకు సిద్ధమన్నారు. ఈ చర్చ కోసం సీఎం క్యాంపుకార్యాలయం ప్రగతి భవన్‌కు వచ్చేందుకైనా సిద్ధమన్నారు.


గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ సర్కారు అవినీ తిని నిరూపిస్తామన్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంట్రా క్టర్లను కాపాడేందుకు నీటిపారుదల ప్రాజె క్టును తాగునీటి ప్రాజెక్టు అని కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారని, ఇదే రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని అన్నారు. దీనికి కేసీఆర్, హరీశ్‌రావు సమాధానం చెప్పాలన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకుం టున్నట్లు తనపై టీఆర్‌ఎస్‌ నేతలు నిందలు వేస్తున్నారన్నారు. మిషన్‌ భగీరథ లో 50 శాతం అవినీతి ఉందని రుజువు చేసేందుకు సిద్ధమన్నారు.

Back to Top