ప్రకృతి ఒడిలో సరదాగా ఓ సెల్ఫీ

MP kavitha selfie went viral - Sakshi

సాక్షి, నవీపేట : అందమైన ప్రకృతికి ఎవరైనా దాసోహం కావాల్సిందే. పచ్చని పంటపొలాలు చూస్తే మనలో ఏదో తెలియని ఆనందం. కాసేపు అలాంటి పచ్చని ప్రకృతి ఒడిలో ఎవరైనా సేదతీరాలనుకుంటారు. తాజాగా నిజామామాబాద్ ఎంపీ కవిత ఓ పంటపొలంలో తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలిలా... నిజామాబాద్ జిల్లాలో ఎంపీ కవిత గురువారం పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే జిల్లాలోని నవీపేట మండలంలో వరి పంటను చూసి ఆకర్శితురాలైన కవిత సెల్ఫీ తీసుకున్నారు. నవీపేటకు వెళ్తూ మార్గంమధ్యలో ఓ సెల్ఫీ అని పేర్కొంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.

బోధన్‌ మున్సిపాలిటీకి రూ.63.50 కోట్లు
నవీపేటలో పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవం, బోధన్‌లో ఇతరత్రా అభివృద్ధి పనులకు శ్రీకారం సందర్బంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ కవిత, టీఆర్ఎస్ నేతలు, జిల్లా ఉన్నతాధికారులు నిజామాబాద్‌కు వచ్చారు. బోధన్‌ మున్సిపాలిటీని అభివృద్ధి చేసి, పట్టణాన్ని సుందరీకరణగా మార్చడానికి రూ.63.50 కోట్లు కేటాయించినట్లు ఎంపీ కవిత పేర్కొన్నారు. పట్టణంలోని ప్రతి వార్డును ఈ నెల 25 నుంచి పర్యటిస్తానన్నారు. జిల్లా మంత్రిగా, నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సుదర్శన్‌ రెడ్డి కళాశాలను అభివృద్ధి చేయడంలో విఫలం అయ్యారని కవిత ఆరోపించారు. బోధన్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి పరచడానికి ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ విన్నపం మేరకు రూ.13 కోట్లు కేటాయించి జీవో తీసుకువచ్చానని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top