కొడుకు పాఠశాలకు వెళ్లడం లేదని..100కు డయల్‌ చేసిన తల్లి

 A Mother Who Dialed 100 Said the Son Was Not Going to School - Sakshi

పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరికీ కౌన్సిలింగ్‌ చేసిన పోలీసులు

యాదగిరిగుట్ట (ఆలేరు) : తన కొడుకు పాఠశాలకు వెళ్ల డం లేదని.. ఓ తల్లి 100 డయల్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ  ఘటన యాదగిరిగుట్టలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ ఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం..  పట్టణం లోని అంగడిబజార్‌కు చెందిన గంధమల్ల మంజు ల భర్త గత ఐదేళ్ల క్రితం మరణించాడు. దీంతో పిల్లలను మంచిగా చదివించి ప్రయోజకులను చేయాలని ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే కుమారుడు లోకేష్‌ (14)ను మేడ్చల్‌లోని గురుకుల హాస్టల్‌లో 8వ తరగతిలో చేర్పించింది. దీంతో లోకేష్‌ 5 రోజుల క్రితం హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చాడు. తిరిగి పాఠశాలకు వెళ్లమంటే మారం చేస్తున్నాడు. తన కుమారుడిని భయపెట్టడానికి మంజుల మంగళవారం 100కు డయల్‌ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు విద్యార్థి లోకేష్‌ను, తల్లి మం జులను యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడివిగా కావా లని విద్యార్థికి పోలీసులు సూచించారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top