కన్నకొడుకుకు తలకొరివి పెట్టిన తల్లి

Mother Done Sons Funerals In Siddipet - Sakshi

నంగునూరు(సిద్దిపేట): పేగు తెంచుకొని పుట్టిన కొడుకుకు తల్లి తలకొరివి పెట్టిన సంఘటన శుక్రవారం నంగునూరు ప్రజలను కలిచివేసింది. గ్రామానికి చెందిన గౌరబోయిన నందు నర్మేట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం గ్రామానికి చేరుకున్న నందు మృతదేహాన్ని చూసి బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. శుక్రవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా నందు అవివాహితుడు కావడం, తండ్రి గతంలోనే మృతిచెందడంతో తల్లి స్వప్న అంత్యక్రియలు నిర్వహించింది.

కన్న కొడుకుకు తల్లి దహన సంస్కారాలు నిర్వహించడం చూసి చలించిన మహిళలు, స్నేహితులు బోరున విలపించారు. అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ నంగునూరులో కొవ్వోత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. నిరుపేదలైన నందు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top