రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ మెరుగుదలపై సమీక్ష

A Meeting Held On Road Safety And Traffic Improvement In Khairatabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌లోని ‘ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇంజనీరింగ్ భవన్’లో సోమవారం రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ మెరుగుదలపై ఒక రోజు సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ‘రోడ్ సేఫ్టీ ఆడిట్ ఫర్ ఇంప్రూవ్ మెంట్ ఆఫ్ ట్రాఫిక్ సేఫ్టీ’ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నగరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ట్రాఫిక్‌ ఒకటి. రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాలకు తగ్గట్లు రహదారులు పెరగకపోవడం, చాలాచోట్ల రోడ్లపై అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగడంతో నగరవాసులకు రద్దీ ప్రాంతాల్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. దీంతో ట్రాఫిక్‌ కట్టడితో పాటు ప్రమాదాలకు చెక్‌ పెట్టడానికి అధికారులు సమావేశమయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోడ్లు రవాణా భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాక విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఆర్అండ్‌బీ ఇంజనీర్‌ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్, డీజీపీ కృష్ణ ప్రసాద్, పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top