ప్రేమించలేదనే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

man commits suicide over love failure - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

పెద్దకొత్తపల్లి(కొల్లాపూర్‌): ఇష్టపడిన అమ్మాయి తనను ప్రేమించలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌కు చెందిన దెంది చిన్న నారాయణ-సుభద్రమ్మ ఏకైక కుమారుడు దెంది రాజు(26) అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే, ప్రేమను నిరాకరించడంతో శుక్రవారం మధ్యాహ్నం ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అపస్మారక స్థితికి చేరుకున్న రాజును చుట్టుపక్కల వారు కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. కాగా, రాజు తండ్రి నారాయణ 20 ఏళ్ల క్రితం మృతి చెందగా.. తల్లి సుభద్రమ్మ కూలి పని చేస్తూ జీవనం గడుపుతోంది. రాజు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె రోదించిన తీరు గ్రామస్తులను కంట తడి పెట్టించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top