బైకుల దొంగ అరెస్ట్‌

Man Arrested For Stealing Two Wheeler In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: మండలంలో ఈనెల 10న 2 మోటార్‌సైకిళ్లు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి బుధవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు గార్ల, బయ్యారం సీఐ వై.రమేష్‌ తెలిపారు. బుధవారం గార్ల పోలీస్‌స్టేషన్‌లో మోటార్‌సైకిళ్ల చోరీకి సంబందించిన వివరాలను సీఐ విలేకరులకు వెల్లడించారు. గార్లలో గత 2 నెలల క్రితం బంధువుల ఇళ్లకు వచ్చిన మహ్మద్‌ రఫిక్‌ గార్లలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 10న అర్ధరాత్రి గార్లకు చెందిన పతంగి ప్రవీణ్, గద్దపాటి రాము తమ ఇళ్ల ముందర మోటార్‌సైకిళ్లు పెట్టి, ఉదయాన్నే లేచిచూడగా మోటార్‌ సైకిళ్లు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు గార్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు గార్ల ఎస్సై పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి గార్లలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మహ్మద్‌ రఫిక్‌ మోటార్‌సైకిళ్ల చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు.

నాటినుంచి పరారీలో ఉన్న నిందితుడు బుధవారం సత్యనారాయణపురం క్రాస్‌రోడ్‌ వద్ద చోరీ చేసిన అప్పాచీ, స్కూటీ మోటార్‌సైకిళ్లను వేరే వ్యక్తులకు అమ్ముతుండగా గార్ల పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి రూ.1లక్ష విలువ గల 2 మోటార్‌సైకిళ్లను స్వాధీన పరుచుకుని, నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ఇకనుంచి ప్రతీ గ్రామంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుని శాంతి భద్రతలను కాపాడుకోవడంలో పోలీసులతో ప్రజలు భాగస్వాములు కావాలని సీఐ కోరారు. కాగా, మోటార్‌సైకిళ్ల చోరీ నిందితుడిని పట్టుకున్న ఎస్సై పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సిబ్బందిని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అభినందించి, వీరికి త్వరలో రివార్డులు అందజేస్తామని తెలిపినట్లు సీఐ రమేష్‌ విలేకరులకు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top